విశాలాంధ్ర – జేఎన్టియుఏ: లక్ష్యం వైపు పయనిస్తున్న సమయంలో అవరోధాలను అవకాశాలుగా మలుచుకుని లక్ష్యాలను సాదించుకోవాలని మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ ఆచార్య డాక్టర్ రామనాథన్, మెటా వేటర్ పేర్కొన్నారు. బుధవారం కళాశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అండ్ మిషన్ లెర్నింగ్ విభాగంలో విద్యార్థులు, తల్లిదండ్రులతో కోర్సు లక్ష్యాలు, జీవన విధానంలో సవాళ్లు అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సు లో వారు మాట్లాడుతూ.. విద్యార్థులకు మానసిక, శారీరక, ఆత్మస్థైర్యాన్ని ఇచ్చేలా ప్రోత్సహిస్తూ.. విద్యార్థుల గమ్యం వైపు అడుగులు వేసేలా.. క్రమశిక్షణ పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. కళాశాలలో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకొని, అధ్యాపకుల బోధన, పరిశోధన కేంద్రాలు, గ్రంథాలయం, క్రీడలు సమయాన్ని కేటాయించి అన్ని రంగాలలోనూ రాణించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివాగధిపతి డాక్టర్ పద్మ, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.


