- Advertisement -
విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని సిద్దయ్య గుట్ట వద్ద గల శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం నూతన నిర్మాణం ఆలయ కమిటీ వారు చేపట్టుతున్నారు. ఇందులో భాగంగా ఆలయ నిర్మాణం నిమిత్తం పట్టణంలోని జగ్గా చంద్రకళ వారి భర్త జ్ఞాపకార్థం లక్ష రూపాయల నగదును విరాళంగా అందజేశారు. అనంతరం ఆలయ కమిటీ అధ్యక్షురాలు సంకారపు జయ శ్రీ ఆలయ కమిటీ తరఫున జగ్గా చంద్రకళ కుటుంబానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, కుటుంబం పేరిట ప్రత్యేక పూజలను నిర్వహించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


