Homeజిల్లాలుకర్నూలుటీడీపీ కార్యకర్తలు వైసీపీలో చేరిక

టీడీపీ కార్యకర్తలు వైసీపీలో చేరిక

- Advertisement -

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని ముచ్చిగిరి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు బుధవారం 20 కుటుంబాలు వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు ప్రదీప్ రెడ్డి సమక్షంలో మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీలోకి చేరారు. ఈ సందర్భంగా వారికి వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గ్రామానికి చెందిన బోయ తాయప్ప, బోయ శివారెడ్డి, గోవిందు, రంగస్వామి, నాగరాజు, రామాంజని, గురురాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు కావస్తున్నా, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి రావడానికి ఏదైనా చేయడానికి సిద్ధమైన నారా చంద్రబాబు నాయుడు పాలన నచ్చకపోవడంతో తాము కూటమి పార్టీని వీడి వైసీపీలో చేరుతున్నట్లు తెలిపారు. మాట ఇస్తే మాట తప్పని నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వెంట నడవడానికి తాము సిద్దంగా ఉన్నామని, పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. వైసీపీ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని, పార్టీ సిద్ధాంతాలకు కట్టబడి ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ హనుమంతు, వైసీపీ నాయకులు సురేష్ గౌడ్, నాగప్ప, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు