Saturday, March 7, 2026
Homeజిల్లాలుఅనంతపురంపాడి పరిశ్రమ రైతులకు దాణా పంపిణీ

పాడి పరిశ్రమ రైతులకు దాణా పంపిణీ

- Advertisement -


విశాలాంధ్ర – శెట్టూరు (అనంతపురం జిల్లా) : మండల పరిధిలో కరిడిపల్లి, మాకోడికి తాండ, లింగదీర్లపల్లి గ్రామంలో ఎస్టీ రైతులకు 50% సబ్సిడీ తో 100 బస్తాల దాణా బుధవారం లింగదీర్లపల్లి గ్రామంలో పాడే పరిశ్రమ రైతులకు పంపిణీ కార్యక్రమం చేపట్టారు పశువర్ణ శాఖ ఏడి నాగ లింగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ పశువుల దాణాతో పశువులకు చాలా ఉపయోగాలు ఉన్నామని వారు తెలియజేశారు దాణాని సరైన మోతాదులో పశువులకు ఇచ్చినచో పశువుల ఆరోగ్యం మెరుగుపడి మంచి దూడలు పుట్టడానికి ఆస్కారం ఉంటుందని, అలాగే పాలిచ్చే ఆవులు అధిక పాలు దిగుబడిని ఇస్తావని వారు రైతులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రసాద్,మాజీ జెడ్పిటిసి గురు ప్రసాద్, తిప్పేస్వామి, శెట్టూరు సర్పంచ్ కుమార్, నగేష్ యాదవ్,స్టాక్ అసిస్టెంట్ మల్లికార్జున్, పశు వైద్య సిబ్బంది సురేష్ , చక్రవర్తి, నిర్మల, పార్ట, రైతులు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు