Sunday, January 18, 2026
Homeజిల్లాలునెల్లూరుతల్లిపాలే ముద్దు… డబ్బా పాలు వద్దు..

తల్లిపాలే ముద్దు… డబ్బా పాలు వద్దు..

- Advertisement -

సూపర్వైజర్ సునీత

విశాలాంధ్ర వలేటివారిపాలెం. తల్లిపాలు ముద్దు.. డబ్బా పాలు వద్దు అని అంగన్వాడి సూపర్వైజర్ సునీత అన్నారు. బుధవారం కొండసముద్రం అంగన్వాడి సెంటర్ లో ప్రపంచతల్లిపాల వారోత్సవాలు కార్యక్రమం
సీడీపీఓ మాధవిలత సూచనల మేరకు కొండసముద్రం అంగన్వాడీ సెంటర్ లో నిర్వహించారు. ఈ ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు కార్యక్రమం ఆగస్టు 1 నుండి 7 వరకు తల్లిపాలవారోత్సవాలు కార్యక్రమం జరపాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. పుట్టిన బిడ్డకు అరగంట లోపు ముర్రు పాలు పట్టించాలని అన్నారు.తల్లి పాల సంస్కృతి ప్రోత్సాహానికి ప్రాధాన్యత ఇద్దాం అని అన్నారు. తల్లి పాలు బిడ్డ హక్కు అని, తొలి టీకా జీవితానికి కవచం అని అన్నారు.ఆరోగ్య భవితకు బలమైన పునాది తల్లి పాలు ఇవ్వడం వలన బిడ్డకే కాదు తల్లికి కూడా శారీరకంగా, మానసికంగా, ఆర్ధికంగా రక్షణ లభిస్తుందని అన్నారు. తల్లిపాలు బిడ్డకు సంపూర్ణ పోషకాహారం, అమృతం లాంటివి అని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం లో సూపర్వైజర్ సునీత, ఏఎన్ ఎం పద్మ, ఆశ, ఎఎల్ హెచ్ పీ సురేఖ, అంగన్వాడీ కార్యకర్తలు శిరీష, శిరోమణి జయలక్ష్మి, తల్లులు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు