Homeఅంతర్జాతీయంమాటమార్చిన ట్రంప్‌

మాటమార్చిన ట్రంప్‌

- Advertisement -

వాషింగ్టన్‌: ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సుంకాలతో రెచ్చిపోతున్నారు. రష్యాతో చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై 100 శాతం సుంకాలు విధిస్తానన్నారు. ఈ విషయంలో ట్రంప్‌ మాట మారుస్తూ, అలాంటి శాతాలేమీ నేను చెప్పలేదని వెల్లడిరచారు. శ్వేతసౌధం వద్ద విలేకరుల సమావేశంలో ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. అదనపు సుంకాలకు సంబంధించి ఎప్పుడు కూడా అలాంటి శాతాలను చెప్పలేదు కానీ అందుకోసం కసరత్తు చేస్తున్నామని చెప్పారు. సమీప భవిష్యత్‌లో ఏం జరుగుతుందో చూద్దామన్నారు. రష్యాతో సమావేశం కాబోతున్నట్లు తెలిపారు.
భారత్‌తో సంబంధాలు తెంచుకోవద్దు: నిక్కీ హేలి
చైనాతో మృదువు వ్యవహారం… భారత్‌తో వ్యూహాత్మక బంధం పణంగా పెట్టేయడం ఏమిటంటూ ట్రంప్‌ చర్చలను ఐరాసలో అమెరికా దౌత్యాధికారి నిక్కీ హేలీ ప్రశ్నించారు. ‘రష్యా నుంచి చమురును భారత్‌ కొనుగోలు చేసివుండకూడదు కానీ రష్యా, ఇరాన్‌ నుంచి చమురు కొనుగోళ్లలో అగ్రగామిగా నిలిచే చైనాకు మాత్రం సుంకాలు విధించకుండా 90 రోజుల మినహాయింపు ఇచ్చారు. చైనాకు మినహాయింపు ఇచ్చి, శక్తిమంతమైన భాగస్వామిగా ఉన్న భారత్‌ను దూరం చేసుకోవద్దు. ఆ దేశంతో ఉన్న వ్యూహాత్మక సహకార బంధాన్ని తెంచుకోవద్దు’ అని ఎక్స్‌లో నిక్కీహేలి పేర్కొన్నారు.
రష్యాపై ఆంక్షలు విధించకపోవచ్చు!
ఉక్రెయిన్‌తో శాంతి ఒప్పందం కోసం రష్యాకు ట్రంప్‌ ఇచ్చిన గడువు శుక్రవారంతో ముగియనుంది. డెడ్‌లైన్‌ తర్వాత రష్యాపై అమెరికా ఆంక్షలను విధించకపోవచ్చని అధికార వర్గాలను ఉటంకిస్తూ న్యూయార్క్‌ పోస్ట్‌ నివేదించింది. ‘ట్రంప్‌కు సంబంధించినంత వరకు అనుకున్న విధంగా ఒప్పందం చేసుకోవడం ముఖ్యం… ఇందుకోసం యంత్రాంగం గట్టిగా కృషి చేస్తోంది’ అని అధికార వర్గాలు తెలిపినట్లు వార్తా కథనం పేర్కొంది. 2022 నుంచి పశ్చిమ దేశాలు తమపై ఆంక్షలు విధిస్తున్నా నిలద్రొక్కుగోగలమని రష్యా ఎప్పటికప్పుడు చెబుతోంది. ఆంక్షల విధానం వైఫల్యాన్ని పశ్చిమ దేశాలు అంగీకరించలేకపోతున్నాయని దుయ్యబట్టింది. రష్యాకు అల్టిమేటం అంటూ ట్రంప్‌ ఆటలు ఆడుతున్నారని రష్యా భద్రతా మండలి డిప్యూటీ చైర్మన్‌ దిమిత్రీ మెద్వదేవ్‌ ఇటీవల వ్యాఖ్యానించారు.
మాస్కోలో విట్కాఫ్‌తో పుతిన్‌ భేటీ
అమెరికా అధ్యక్షుడికి ప్రత్యేక రాయబారి స్టీవ్‌ విట్కాఫ్‌ రష్యా పర్యటన సందర్భంగా రాజధాని మాస్కోలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఆయనతో సమావేశమయ్యారు. ఈ భేటీ క్రెమ్లిన్‌లో జరిగింది. దాదాపు మూడు గంటల పాటు వీరు చర్చించుకున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. కాగా, విట్కాఫ్‌ బుధవారం తెల్లవారుజామున మాస్కో చేరుకున్నారు. నుకోవా`2 విమానాశ్రయంలో రష్యా అధ్యక్షుడికి ప్రత్యేక ప్రతినిధి కిరిల్‌ దిమిత్రీవ్‌ని ఆయన కలిశారు. ఓ గంట తర్వాత క్రెమ్లిన్‌కు దగ్గరలోని జర్యాడే పార్కులో ఈ ఇద్దరు కాసేపు తిరిగారు. ఈ ఏడాదిలో విట్కాఫ్‌ ఐదవ సారి రష్యాలో పర్యటించారు. రష్యాతో వాణిజ్యంపై ప్రపంచ దేశాలకు ట్రంప్‌ హెచ్చరికలు చేస్తున్న సమయంలో విట్కాఫ్‌ రష్యా పర్యటన, పుతిన్‌తో భేటీకి ప్రాధాన్యత ఏర్పడిరది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు