బొగోటా: కొలంబియా సెనేటర్, అధ్యక్ష అభ్యర్థి మిగ్యుల్ ఉరిబ్ టర్బే (39) మరణించినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడిరచాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. జూన్‌లో మిగ్యుల్ బహిరంగ ప్రదేశంలో నిర్వహించిన ఓ ప్రచార కార్యక్రమంలో ప్రసంగిస్తుండగా… ఓ దుండగుడు ఆయన వెనక నుంచి తలపై పలుమార్లు కాల్పులు జరిపాడు. అప్రమత్తమైన అధికారులు ఆయనను ఆస్పత్రికి తరలించారు. బొగోటా మేయర్ కార్లోస్ గాలన్ ఈ విషయన్ని ధ్రువీకరించారు. అనంతరం 15 ఏళ్ల నిందితుడు సహా ఈ కేసులో ఐదుగురు అనుమానితులను కొలంబియా పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనను మిగ్యుల్ పార్టీ కన్జర్వేటివ్ డెమోక్రటిక్ తీవ్రంగా ఖండిరచింది. ఈ హత్యాయత్నంలో రాజకీయ కోణం ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేసింది. నాటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం కన్నుమూశారు. కాగా వచ్చే ఏడాది కొలంబియాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష కన్జర్వేటివ్ డెమోక్రటిక్ పార్టీ నుంచి మిగ్యుల్ పోటీకి దిగారు.
కొలంబియా అధ్యక్ష అభ్యర్థి మృతి
- Advertisement -
RELATED ARTICLES


