Homeజిల్లాలుఎన్టీఆర్ జిల్లాస్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు శరవేగంగా ఏర్పాట్లు

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు శరవేగంగా ఏర్పాట్లు

- Advertisement -


పరిశీలించిన కలెక్టర్‌ లక్ష్మీశ, సీపీ రాజశేఖర్‌బాబు

విశాలాంధ్రవిజయవాడ: స్వాతంత్య్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసి సిద్ధంగా ఉంచాలని జిల్లా కలెక్టర్‌ డా. జి లక్ష్మీ శ అధికారులను ఆదేశించారు. వేడుకలకు చేపట్టిన తుది ఏర్పాట్లను మంగళవారం ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జిల్లా కలెక్టర్‌ డా.జి లక్ష్మి శ, నగర పోలీస్‌ కమిషనర్‌ ఎస్వీ రాజశేఖర్‌ బాబుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ నెల15వ తేది శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నిర్వహించేందుకు నగరపాలక సంస్థ, సాధారణ పరిపాలన శాఖ, వైద్య ఆరోగ్య, విద్యుత్‌, పోలీస్‌, ఫైర్‌ శాఖలతో సమన్వం చేసుకుని ఇటువంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ప్రణాళికబద్ధంగా అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేయాలన్నారు. వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులకు కేటాయించిన విధులను తూచా తప్పకుండా పాటించాలని ఆదేశించారు. సామాన్య ప్రజలకు విఐపిలు, వివిఐపిలకు ప్రోటోకాల్‌ ప్రకారం ఏర్పాట్లు ఉండాలని, వాహనాలకు కేటాయించిన పార్కింగ్‌ ను మరొకసారి పరిశీలించి లోటుపాట్లు లేకుండా చూడాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు.ఏర్పాట్ల పరిశీలనలో ఆర్డీవో కే చైతన్య, అడిషనల్‌ సిపి కేజీవి సరిత, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు