విశాలాంధ్ర పుట్టపర్తి: – పాఠశాలలో ప్రతి విద్యార్థి ఆరోగ్యంగా ఉండాలని ఆర్డిఓ ఆర్డీవో సువర్ణ అన్నారు మంగళవారం ఎనుములపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం నిర్వహించారు. ఆర్డిఓ స్వయంగా విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఆర్డీవో సువర్ణ మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి ఆరోగ్యంగా ఉండాలంటే ఆల్బెండజోల్ మాత్రలను సంవత్సరానికి రెండు సార్లు వేసుకోవాలన్నారు. నేటి నుంచి 20వ తేదీ వరకు ప్రతి పాఠశాల కళాశాలలో ఉచితంగా ఈ మాత్రలు అందించడం జరుగుతుందని తెలిపారు. శరీరంలో నులిపురుగులు లేకపోతే విద్యార్థులు ఆరోగ్యంగా ఉండి చక్కగా చదువుకోగలుగుతారని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్వో సునీల్, వైద్య ఆరోగ్యశాఖ కోఆర్డినేటర్ రాజేష్. ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.


