విశాలాంధ్ర :చిలమత్తూరు,…మండల పరిధిలోని కాపు చెన్నంపల్లి గ్రామానికి వీధిలైట్లు, సమర్థన ట్రస్ట్ దివ్యాంగులకు దుప్పట్లను ఎమ్మెల్యే శ్రీ నందమూరి బాలకృష్ణ ఆశీస్సులతో వితరణ చేయడం జరిగినది, కాపు చెన్నంపల్లిలో గత కొన్ని నెలల నుండి వీధిలైట్లు లేక ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు లక్ష్మీనారాయణ యాదవ్ దృష్టికి తీసుకురాగా తన సొంత నిధులతో పంచాయతీ వీధిలైట్లకు గాను రూ6000 విరాళంగా ఇవ్వడం జరిగినది. బాలకృష్ణ సతీమణి వసుంధర జన్మదిన వేడుకలలో భాగంగా కొడికొండ చెక్ పోస్ట్ నందు గల సమర్థనము ట్రస్టులో జన్మదిన వేడుకలు తెలుగుదేశం పార్టీ నాయకులు ,కార్యకర్తలు సమక్షంలో ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా లక్ష్మీనారాయణ యాదవ్ తన వంతు సహాయంగా దివ్యాంగుల సమక్షంలో ఇచ్చిన మాట ప్రకారం రూ10000 విలువ గల 30 దుప్పట్లు దివ్యాంగులకు పంపిణీ చేశారు, దీంతో పలువురు ఆయన దాతృత్వానికి హర్షం వ్యక్తం చేశారు.
వీధిలైట్లు, దుప్పట్లు వితరణ చేసిన లక్ష్మీనారాయణ యాదవ్
- Advertisement -
RELATED ARTICLES


