Homeఆంధ్రప్రదేశ్తీరం దాటిన వాయుగుండం.. ఉత్తరాంధ్రలో వర్షాలు

తీరం దాటిన వాయుగుండం.. ఉత్తరాంధ్రలో వర్షాలు

- Advertisement -

వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పాడిన వాయుగుండం ఈరోజు మధ్యాహ్నం తీరం దాటింది. విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం.. వాయుగుండం ఒడిశాలోని గోపాల్‌పూర్‌కి సమీపంలో తీరం దాటింది. గంటకు 7 కిలోమీటర్ల వేగంతో కదిలిన వాయుగుండం.. మధ్యాహ్నం తీరాన్ని తాకింది. వాయుగుండం ప్రభావంతో గంటకు 35 – 45 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని, ఉత్తరాంధ్రలో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు