Homeజిల్లాలుఏలూరుపేదలకు సేవ చేయడమే లక్ష్యం

పేదలకు సేవ చేయడమే లక్ష్యం

- Advertisement -

విశాలాంధ్ర – కొయ్యలగూడెం ( ఏలూరు జిల్లా) : నిరుపేద ప్రజలకు వైద్య వృత్తిలో సేవ చేయడంలో సురక్ష ఆసుపత్రి వైద్యులు కె .దిలీప్ కుమార్ ఎంతో సహృదయంతో ముందుకు వస్తారని టిడిపి మండల అధ్యక్షులు పారేపల్లి నరేష్ పేర్కొన్నారు. దిలీప్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఆసుపత్రి వద్ద ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. మండల కేంద్రమైన కొయ్యలగూడెం పట్టణంలో సురక్ష ఆసుపత్రి ఏర్పాటు చేయడంతో ఎంతోమందికి వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు