Homeజిల్లాలుశ్రీ సత్యసాయిధర్మవరం బీసీ బాలుర వసతిగృహం, గొట్లూరు జడ్‌పి హైస్కూల్‌లో కొత్త టాయిలెట్స్ ప్రారంభం

ధర్మవరం బీసీ బాలుర వసతిగృహం, గొట్లూరు జడ్‌పి హైస్కూల్‌లో కొత్త టాయిలెట్స్ ప్రారంభం

- Advertisement -

ప్రజల సమస్యలకు ఎల్లప్పుడూ అందుబాటులో మంత్రి కార్యాలయం ఉ మంత్రి సతీమణి త్రివేణి భరోసా
విశాలాంధ్ర ధర్మవరం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు సత్య కుమార్ యాదవ్ చొరవతో, సంస్కృతి సేవా సంస్థ ఆధ్వర్యంలో, హిందుస్థాన్ కోకా కోలా బేవరేజెస్ కార్పొరేట్ సంస్థ సహకారంతో సిఎస్ఆర్ నిధుల ద్వారా విద్యార్థుల కోసం కొత్త పారిశుద్ధ్య సదుపాయాలు నిర్మించబడ్డాయి. ఇందులో భాగంగా ధర్మవరం పట్టణంలోని బీసీ బాలుర వసతిగృహం వద్ద విద్యార్థుల అవసరాల నిమిత్తం ఆధునిక టాయిలెట్స్, అలాగే ధర్మవరం రూరల్ మండలం గొట్లూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థినీల కోసం ప్రత్యేకంగా టాయిలెట్స్ నిర్మాణం పూర్తి చేసి,ఈ రెండు సదుపాయాలను మంత్రి సతీమణి త్రివేణి ప్రత్యేక కార్యక్రమంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా త్రివేణి మాట్లాడుతూ, విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రత కోసం ఇటువంటి సదుపాయాలు అత్యంత కీలకమని పేర్కొన్నారు. ముఖ్యంగా బాలికల కోసం సురక్షితమైన మరియు శుభ్రమైన టాయిలెట్స్ అందుబాటులో ఉండటం, వారి చదువులో కొనసాగింపుకు మద్దతు ఇస్తుందని తెలిపారు. అలాగే పట్టణంలో, గ్రామీణ ప్రాంతాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించడం కోసం ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు కలిసి ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. అదనంగా, విద్యార్థులు లేదా ప్రజలకు ఎలాంటి సమస్యలు ఎదురైనా ఎప్పుడైనా నేరుగా మంత్రి సత్య కుమార్ యాదవ్ కార్యాలయాన్ని సంప్రదించాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం జగన్నాథం, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ వినయ్, బీసీ హాస్టల్ వార్డెన్ విష్ణువర్ధన్ రెడ్డి, బీసీ గర్ల్స్ హాస్టల్ వార్డెన్ జ్యోతి, మార్కెట్ యార్డ్ చైర్మన్ అరుణశ్రీ, పట్టణ అధ్యక్షులు చంద్ర, రూరల్ అధ్యక్షులు చంద్ర, బిజెపి సీనియర్ నాయకులు ఏలుకుంట లక్ష్మీనారాయణ, చింతలపల్లి కొండయ్య, కంచం లీలావతి, బీసీ హాస్టల్ సిబ్బంది నవీన్, రామిరెడ్డి, ఈశ్వరయ్య, రేణుక, పోతుకుంట రాజు, బిల్లే శ్రీనివాసులు, ప్రకాష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు