విశాలాంధ్ర -ధర్మవరం : ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అనంతపురం డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు ధర్మవరం మున్సిపాలిటీకి సంబంధించిన మూడు బార్లకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందని, ఈనెల 13వ తేదీ నుండి అమలులోకి వచ్చిందని ఎచ్సిఐ చంద్రమణి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఒక్కొక్క బారుకు తప్పనిసరిగా నాలుగు దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు. అదేవిధంగా నాన్ రిఫండబుల్ కింద రూ.5,10,000 తోపాటు ఒక్కొక్క బారుకు సంవత్సరానికి 55 లక్షలు ఆరు విడతలుగా రుసుమును చెల్లించవలెనని తెలిపారు. కావున ఆసక్తిగా ఉన్న వారందరూ కూడా ఆన్లైన్ లేదా హైబ్రిడ్ లేదా ఆఫ్ లైన్లో దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు. ఆఫ్లైన్ ద్వారా వేయదరిచిన వారు పుట్టపర్తి డిపిఈఓ కార్యాలయంలో దరఖాస్తులను ఇవ్వవలసి ఉంటుందని తెలిపారు. ఈ బార్లు పాలసీ మూడు సంవత్సరాల కాల పరిమితి ఉంటుంది అని తెలిపారు.
మూడు బార్లకు నోటిఫికేషన్.. ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ చంద్రమణి
- Advertisement -
RELATED ARTICLES


