
భాద్యత లేదా? మీటింగ్ లకు హాజరుకారా?
విశాలాంధ్ర – తాళ్లపూడి : వర్షాకాలం లో గ్రామాల్లో చేపట్టే ప్రత్యేక కార్యక్రమాలు, స్వచ్ఛ కార్యక్రమాలు అమలు కొరకు తాళ్లపూడి మండలం అన్నదేవరపేట గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే ముప్పిడి హఠాత్తుగా అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కి అక్కడున్న వాతావరణం కానీ, అధికారులు హాజరు కాక పోవటం వెరసి తీవ్ర ఆగ్రహాన్ని కల్గించాయి. ముందు గా ఆస్పత్రి ప్రాంగణం చూసి వైద్య సిబ్బందిని, పంచాయతీ సిబ్బంది ఎక్కడు న్నారంటూ ఎమ్మెల్యే మండిపడ్డారు. ఎంపీడీఓ కానీ తహసీల్దార్ కానీ ఆ సమయం లో హాజరు కాకపోవటం మరింత అసహనానికి గురయ్యారు. ఆస్పత్రి ప్రాంగణం అంతా మొక్కలుతో నిండిపోవటం చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు పంచాయతీని, ఇటు ఆరోగ్య శాఖను అన్ని శాఖల అధికారుల చర్యలను తప్పు పట్టారు. ఎం.ఆర్.జి.ఎస్ అధికారులు ను పిలిచి పని చేయించాలని పంచాయతి కార్యదర్శి కి ఆదేశించారు. త్వరిత గతిన మొత్తం అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు. నిధులు సమకూరత లేకుంటే తనకు తెలియ చేయాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆస్పత్రి కి సంభందించి కొత్త భవనానికి ప్రతిపాదన తయారు చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు ఫోన్ లో ఆదేశించారు. ఎన్డీయే కూటమి నాయకులు అద్వర్యం లో పారిశుధ్య కార్మికులు కు రక్షణ దుస్తులు అందించారు. అన్నతరం ప్రాంగణం లో మొక్కలు నాటారు. ఆగస్టు 15 న అవార్డులు అందుకున్న డా.స్వర్ణలత, ఎస్సై టి.రామకృష్ణల ను సత్కరించారు.


