Homeజిల్లాలుశ్రీ సత్యసాయిపేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా ధ్యేయం..

పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా ధ్యేయం..

- Advertisement -

యువర్స్ ఫౌండేషన్ అధ్యక్ష, కార్యదర్శులు
విశాలాంధ్ర ధర్మవరం : పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా ధ్యేయం అని యువర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్ర, కార్యదర్శి జయరాం, కోశాధికారి వంకదారి మోహన్, క్యాంపు చైర్మన్ ఖలీల్ రెహ్మాన్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని స్వాతి క్లినిక్ లో సెప్టెంబర్ ఏడవ తేదీ ఆదివారం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల (వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా) నిర్వహించబడే ఉచిత ఐఓఎల్ కంటి వైద్య శిబిరం యొక్క కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ కంటి వైద్య శిబిరం యువర్స్ ఫౌండేషన్, జిల్లా అందత్వ నివారణ సంస్థ -శ్రీ సత్య సాయి జిల్లా, నేత్ర జ్యోతి కంటి ఆసుపత్రి-బెంగళూరు వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత 30 సంవత్సరాల నుండి వేల మందికి కంటి ఆపరేషన్లు నిర్వహించి, నేత్ర జ్యోతి కంటి ఆసుపత్రి వారు ధర్మవరం శిబిరం పెట్టడం గర్వించదగ్గ విషయమని తెలిపారు. ఈ శిబిరం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తామన్నారు. అదేవిధంగా కంటి శుక్లములు ఉన్న వారిని పరీక్షించి ఉచితంగా ఐఓఎల్ ఆపరేషన్ నిర్వహిస్తామని తెలిపారు. శిబిరంలో పాల్గొన్న వారందరికీ కంటి పరీక్షలు నిర్వహించి, కంటి ఆపరేషన్లకు ఎంపికైన వారికి బెంగళూరులో పూర్తిగా ఉచిత ఆపరేషన్, ఉచిత ప్రయాణ ము, ఉచితంగా అద్దాలను కూడా పంపిణీ చేయబడునని తెలిపారు. బిపి, షుగర్, గుండె జబ్బులు ఉన్నవారు ప్రస్తుతం వాడుతున్న మందులు డాక్టర్ రిపోర్టు తీసుకొని రావాలని తెలిపారు. ఈ శిబిరానికి దాతలుగా కీర్తిశేషులు సీకే. శ్రీరాములు జ్ఞాపకార్థం వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించడం జరుగుతున్నదని తెలిపారు. ఈ శిబిరానికి వచ్చువారు ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి, రేషన్ కార్డ్ జిరాక్సులు, ఫోన్ నెంబర్ చిరునామాతో రావాల్సి ఉంటుందని తెలిపారు. కావున ఈ చక్కటి అవకాశాన్ని పట్టణంలోని, గ్రామీణ ప్రాంతాలలోని పేద ప్రజలు సద్వినియోగం చేసుకొని కంటి వెలుగును ప్రసాదించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఆర్వో. రాధాకృష్ణ, చాంద్ బాషా, డాక్టర్. సుబ్బారావు, పోలా ప్రభాకర్, ఓ వి. ప్రసాద్, కోటేశ్వరరావు, గర్రె రమేష్ బాబు, బండి నాగేంద్ర ,దాత సి. కె. రామాంజనేయులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు