Homeజిల్లాలుశ్రీ సత్యసాయిప్రజల్లో శాస్త్రీయ దృక్పథం, ప్రశ్నించేతత్వం పెరగాలి

ప్రజల్లో శాస్త్రీయ దృక్పథం, ప్రశ్నించేతత్వం పెరగాలి

- Advertisement -

మాజీఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్
విశాలాంధ్ర ధర్మవరం; ప్రజల్లో శాస్త్రీయ దృక్పధo ప్రశ్నించే తత్వం పెరిగినప్పుడే ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారీ ఉంటాయని మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక ఎన్జీవో హోంలో జరిగిన జన విజ్ఞాన వేదిక జిల్లా మహాసభలకు వారు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సమావేశానికి అధ్యక్షులుగా జిల్లా అధ్యక్షుడు మహేందర్ రెడ్డి వ్యవహరించారు. అనంతరం వారు మాట్లాడుతూ
సమాజం లో మంచి వ్యవస్థలన్నీ కుప్పకూలి పోతూ కొత్త మూఢనమ్మకాలు ముందుకు వస్తున్నాయన్నారు.పర్యావరణం పెద్ద సమస్య గా ముందుకొచ్చిందన్నారు .విద్యా వ్యవస్థ లో సృజనాత్మకతకు స్థానం లేకపోగా ర్యాంకులకు ప్రాధాన్యం పెరిగి. పిల్లలను పరిశోధనల వైపు ప్రోత్సహించడం సన్నగిల్లిందన్నారు .ఈ మార్పులను అవగాహన చేసుకుని జేవీవీ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాలు కార్పొరేట్ల చేతుల్లో చిక్కుకుని వాళ్లకు లాభాలు తెచ్చిపెట్టే వనరుగా మారిపోయిందన్నారు. దీన్ని ప్రజల్లో చర్చకు పెట్టాల్సిన బాధ్యత జెవివి కార్యకర్తలుగా మనమీద వుందన్నారు.
దేశ పురోగమనానికి, మనిషి జీవన సౌలభ్యానికి శాస్త్ర సాంకేతిక రంగాలు అత్యంత కీలకమనీ గ్రహించిన మన మొదటితరం పాలకులు శాస్త్రజ్ఞానాన్ని విస్తరింపజేయాలని, పౌరుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలని తెలిపారు.శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి పరంగా మనకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చింది అన్నారు.
ఆర్థిక పెరుగుదల ఊహించని స్థాయికి వెళ్ళిందని లెక్కలు చెబుతున్నాయి అని,
సంపదలు పేరుకుపోతున్నాయి అన్నారు. దేశీయ ధనికులు ప్రపంచ ధనికుల సరసన చేరడం జరిగిందన్నారు. అయినా సరే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో అట్టడుగున వున్నాం కారణం ఏమిటంటే
శాస్త్ర విజ్ఞానం ఫలాలు సామాన్యులకు అందకపోవడమేనని వారు స్పష్టం చేశారు.శాస్త్ర సాంకేతిక రంగాలు పూర్తిగా వ్యాపారమయమై కార్పొరేట్ల కబంధ హస్తాల్లో బందీ అయిపోవడం వల్ల సమాజంలోని ఎక్కవ మందికి ప్రతికూల పరిస్థితులను కల్పిస్తున్నాయని తెలిపారు.
రాష్ట్ర కోశాధికారి రాజశేఖర్ రాహుల్, రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ సాకే భాస్కర్ లు, డాక్టర్ రామ్మూర్తి , డాక్టర్ బషీర్, జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆదిశేషు లు మాట్లాడుతూ
రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించే చర్యలను వ్యతిరేకించాల్సిన అవసరం వుందన్నారు.
సైన్స్ ను అపహాస్యం చేస్తూ తరగతి గదిలోకి మూఢనమ్మకాలను, అశాస్త్రీయ భావజాలాన్ని చూపించడం దౌర్భాగ్యం అన్నారు.
ప్రజల్లో శాస్త్రీయ దృక్పధo పెరిగినప్పుడే ఇలాంటి వాటినీ అడ్డుకోవడానికి ప్రజలు ముందుకు వస్తారన్నారు.
ఈ కార్యక్రమంలో కోశాధికారి చంద్రశేఖర్ రెడ్డి, యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయ చంద్రారెడ్డి, ఏపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి రవీంద్ర రెడ్డి,నర్సారెడ్డి, చైతన్య గంగిరెడ్డి, గౌసెలజం, సురేష్, నిర్ధారణుడు , సంజీవప్ప, లక్ష్మీనారాయణ , షర్ఫుద్దీన్, మహేష్. లోకేష్,వెంకటరామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు