Homeజిల్లాలుశ్రీ సత్యసాయిపేద ప్రజలకు సేవ చేయడంలోనే ఎంతో సంతృప్తి ఉంది..

పేద ప్రజలకు సేవ చేయడంలోనే ఎంతో సంతృప్తి ఉంది..

- Advertisement -

క్యాంపు చైర్మన్ దాసరి వెంకటేశులు (చిట్టి)
విశాలాంధ్ర ధర్మవరం : పేద ప్రజలకు సేవ చేయడంలోనే ఎంతో సంతృప్తి ఉంది అని క్యాంపు చైర్మన్ దాసరి వెంకటేశులు, అధ్యక్షులు బివి రమణ, కార్యదర్శి దాసరి రాధాకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని తొగటవీధిలో గల శ్రీ శాంత కళా చౌడేశ్వరి దేవి ఆలయంలో 114వ ఉచిత వైద్య చికిత్స శిబిరమును వారు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ శిబిరానికి దాతలుగా కీర్తిశేషులు రెడ్డిపల్లి సుబ్బమ్మ, కీర్తిశేషులు రెడ్డిపల్లి రామప్ప జ్ఞాపకార్థం వీరి కుమారుడు రాజేశ్వరి, రామచంద్ర, సాయి మనోజ్ వారి కుటుంబ సభ్యులు వ్యవహరించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ కమిటీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ శిబిరంలో మొత్తం 280 మందికి వైద్య చికిత్సలను అందించడం జరిగిందని, అంతేకాకుండా నెలకు సరిపడా మందులను కూడా ఉచితంగా పంపిణీ చేశామని తెలిపారు. ప్రతి శిబిరము దాతల సహాయ సహకారములతోనే నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ శిబిరంలో నిష్ణాతులైన వైద్యులు డాక్టర్ వివేక్ కుళ్లాయప్ప, డాక్టర్ జై దీపు నేత, డాక్టర్ సతీష్ కుమార్, డాక్టర్ వినయ్ లతో వైద్య చికిత్సలను అందించడంతోపాటు ఆరోగ్యం పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలను కూడా రోగులకు వివరించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మామిళ్ల అశ్వత్త నారాయణ ,బండి నాగరాజు, విజయ్, భాస్కర, ఫణికుమార్, కాచర్ల నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు