విశాలాంధ్ర ధర్మవరం;; ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన డీఎస్సీ పరీక్షా ఫలితాలలో ధర్మవరం పట్టణానికి చెందిన దివ్యశ్రీ, సాయికుమార్ తమ ప్రతిభను చాటారు. జిల్లా స్థాయిలో వీరు ప్రధమ, ద్వితీయ స్థానాలను కైవసం చేసుకున్నారు. ఇందులో భాగంగా పట్టణంలోని కేశవ నగర్ కు చెందిన చేనేత కార్మికుడు అయిన చింతా పరమేశ్వర్ చింతా పద్మావతి దంపతుల యొక్క కుమార్తె దివ్యశ్రీ డీఎస్సీ ఎస్జీటీ పరీక్షా ఫలితాలలో 92.79 మార్కులు సాధించి జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచారు. దివ్యశ్రీ పదో తరగతి ఇంటర్మీడియట్ ను ధర్మారంలో చదువుకొని, టిటిసిను బుక్కపట్నం డైట్ కళాశాలలో చదివారు. తదుపరి ఓపెన్ డిగ్రీ, బిఈడి కూడా చేశారు. చదువు మీద ఆసక్తితో దివ్య శ్రీ ఇంతటి విజయాన్ని సాధించింది. జిల్లాలో ప్రథమ స్థానం సాధించడంతో కుటుంబ సభ్యుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఈ తీపి వార్తతో కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ మిఠాయిని తినిపించారు. అదేవిధంగా పట్టణంలోని వైయస్సార్ కాలనీకి చెందిన చేనేత కుటుంబానికి చెందిన సంగప్ప ఈశ్వరమ్మ దంపతుల కుమారుడు సాయి కుమార్ కూడా డీఎస్సీ పరీక్ష ఫలితాలలో 92.70 మార్కులు సాధించి జిల్లా స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచారు. సాయికుమార్ పదో తరగతి ఇంటర్మీడియట్ ధర్మవరంలో పూర్తి చేసి, బుక్కపట్నంలో డైట్ కళాశాలలో టిటిసి పూర్తి చేయడం జరిగింది. దీంతో తల్లిదండ్రులు తమ కుమారుడు సాధించిన విజయానికి స్వీట్లు తినిపించి తమ ఆనందాన్ని పంచుకున్నారు. చదువును సాధించడంలో పేదరికాన్ని అతి కష్టంతో సాధించి, రుజువు చేశారు దివ్యశ్రీ, సాయికుమార్. పేదరికానికి చదువు అడ్డం కాదని, శ్రమ, పట్టుదల, అకుంఠిత దీక్ష, తపన లాంటివి ఉండడం వల్లనే ఈ ఇద్దరు అభ్యర్థులు జిల్లాకే ఆణిముత్యాలుగా నిలిచారు. ధర్మవరం ప్రజలు కూడా ఈ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
డీఎస్సీలో ప్రతిభ చాటిన ధర్మవరం అభ్యర్థులు..
- Advertisement -
RELATED ARTICLES


