విశాలాంధ్ర ఆస్పరి (కర్నూలు జిల్లా) : యువత, విద్యార్థులతొ పాటు ప్రతి ఒక్కరూ హెచ్ఐవి, ఎయిడ్స్ పై అవగాహన కలిగి ఉండాలని ప్రాజెక్ట్ మేనేజర్ రమణ అన్నారు. మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆదేశాల మేరకు మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటెన్సిఫైడ్ ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛంద సంస్థ హ్యూమన్ అండ్ నేచురల్ రిసోర్సెస్ డెవలప్మెంట్ సొసైటీ వారు విద్యార్థులకు హెచ్ఐవి/ ఎయిడ్స్, సుఖ వ్యాధులు మరియు డ్రగ్ డి- ఆడిక్షన్ లపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్.ఐ.వి వ్యాధి పట్ల యువత, విద్యార్థులు హెచ్.ఐ.వి పట్ల అవగాహన కలిగి ఉండడం వల్ల హెచ్.ఐ.వి కి గురికాకుండా చూసుకోవచ్చని, చికిత్స కన్నా నివారణ మంచిదని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులలో హెచ్.ఐ.వి పరీక్షలు ఉచితంగా అందుబాటులో ఉన్నాయని అలాగే పరీక్షలు చేయించుకున్న వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. హెచ్.ఐ.వి. ఉందనే కారణంతో వివక్ష చూపకూడదన్నారు. వైద్యుల సలహాలు పాటించినట్లయితే ఎటువంటి ఆరోగ్య పరమైన ఇబ్బందులు లేకుండా జీవితం కొనసాగించవచ్చు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆస్పరి పి హెచ్ సి ల్యాబ్ టెక్నీషియన్ హరికృష్ణ, ఓ ఆర్ డబ్ల్యు వైష్ణవి, కైరూన్ బీ, కళాశాల అధ్యాపకులు, కళాశాల, వైద్య సిబ్బంది, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.


