డీఎస్పీ హేమంత్ కుమార్
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో వినాయక చవితి పండుగను సుఖశాంతులతో ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలందరూ జరుపుకోవాలని డి.ఎస్.పి హేమంత్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని షిరిడి సాయిబాబా కళ్యాణ మండపంలో వినాయక ఉత్సవ కమిటీ సభ్యులతో వారు సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం డిఎస్పీ హేమంత్ కుమార్ మాట్లాడుతూ వినాయక విగ్రహాలను ప్రతిష్టించే రోజు నుంచి నిమజ్జనం చేసే వరకు ఎలాంటి తప్పిదాలకు అవకాశం ఇవ్వరాదని, తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని, అధికారుల యొక్క సూచనలను కూడా పాటించాలని వారు స్పష్టం చేశారు. అదేవిధంగా గణేష్ ఉత్సవాల నిర్వహణ, మండపాల ఏర్పాటు, ఊరేగింపులు, నిమజ్జనాలను తప్పనిసరిగా ఆన్లైన్లో నమోదు చేసుకుని క్యూఆర్ కోడ్ పొందాలని తెలిపారు. మండపాల వద్ద విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కాకుండా ముందుగానే జాగ్రత్తలు వహించాలని తెలిపారు. అగ్ని ప్రమాద పరికరాలు కూడా సిద్ధం చేసుకోవాలని తెలిపారు. లౌడ్ స్పీకర్లు రాత్రి పది గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఎవ్వరు కూడా వినియోగించరాదని తెలిపారు. మండపాల వద్ద ఇసుక బస్తాలు నీటి బకెట్లు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ సిఐ నాగేంద్రప్రసాద్, బిజెపి నాయకులు డోలా రాజారెడ్డి, హరీష్ బాబు, అంబటి సతీష్, గుండా పుల్లయ్య, గిర్రాజ్ నగేష్, విశ్వహిందూ పరిషత్ సభ్యులు వేణుగోపాల్, బిజెపి నాయకులు సాకే ఓబులేష్, జింక చంద్రశేఖర్ తో పాటు అధిక సంఖ్యలో వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
వినాయక చవితి సంబరాలను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలి
- Advertisement -
RELATED ARTICLES


