Homeఅంతర్జాతీయంసూడాన్‌లో భారీ విపత్తు

సూడాన్‌లో భారీ విపత్తు

- Advertisement -

విరిగపడ్డ కొండచరియలు – గ్రామం శిథిలం 1000 మందికిపైగా మృతి
ఖార్తూమ్‌ : పశ్చిమ సూడాన్‌లో భారీ విపత్తు సంభవించింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో కొండచరియలు విరిగిపడి ఓ గ్రామం శిథిలమైంది. వెయ్యి మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఒకే ఒక్కడు మృత్యుంజయుడిగా నిలిచాడు. ఈ విపత్తు మర్రా గిరుల నడుమ చోటుచేసుకున్నట్లు సూడాన్‌ లిబరేషన్‌ మూవ్‌మెంట్‌/ఆర్మీ వెల్లడిరచింది. ఒక వైపు యుద్ధం కారణంగా ప్రజలు తరలిపోతుండటం, మరోవైపు ఆకలి కేకలతో కకావికలమైన సూడాన్‌ను తాజా విపత్తు మరింతగా దెబ్బతీసింది. వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి గ్రామం మొత్తం సమాధి అయిందని, తక్షణమే ఆపన్న హస్తం అందించాలని ఐరాసకు సూడాన్‌ లిబరేషన్‌ అధినేత అబ్దుల్‌ వాహిద్‌ పిలుపునిచ్చారు. ఉత్తర దార్ఫూర్‌ రాష్ట్రంలో సూడాన్‌ సైన్యం, రాపిడ్‌ సపోర్ట్‌ ఫోర్సెస్‌ (ఆర్‌ఎస్‌ఎఫ్‌) మధ్య పోరు కారణంగా తరలిపోయిన ప్రజలు మర్రా గిరుల్లో ఆశ్రయం పొందగా, ఇప్పటికే అక్కడ ఆహారం, మందుల కొరత తీవ్రంగా ఉంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు