- Advertisement -
బ్రసెల్స్: పలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించే దేశాల సరసన బెల్జియం చేరింది. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం వేదికగా పలస్తీనా దేశానికి తమ మద్దతు ఇవ్వనున్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి మాగ్జిమ్ పెర్వట్ మంగళవారం ప్రకటించారు. న్యూ యార్క్ డిక్లరేషన్‌పై బెల్జియం సంతకం చేయబోతోందని ఎక్స్‌లో వెల్లడిరచారు. గాజాలో మానవతా విపత్తు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్ దేశాలు పలస్తీనాకు మద్దతు ప్రకటించాయి.


