Homeఆంధ్రప్రదేశ్కలెక్టర్ ఆదేశాల పై ఆక్రమణల పై క్షేత్ర స్థాయిలో పరిశీలన

కలెక్టర్ ఆదేశాల పై ఆక్రమణల పై క్షేత్ర స్థాయిలో పరిశీలన

- Advertisement -

విశాలాంధ్ర – సీతానగరం: తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశాల మేరకు తహసిల్దార్ ఏ శ్రీనివాస్ సీతానగరం బస్ స్టాండ్ సెంటర్లో మంగళవారం అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ శ్రీనివాస్ విలేకరులతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బస్ స్టాండ్ సెంటర్లో కట్టడాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించడం జరిగింది అని అన్నారు. సీతానగరం గ్రామంలో రెవెన్యూ రికార్డులు ప్రకారం 81 సర్వే నెంబర్లో 132 ఎకరాలు గ్రామ కంఠoగా ఉందని, దీనిలో పోలీస్ స్టేషన్, కాలువలు క్రింద 4 ఎకరాలు పోగా 128 ఎకరాలు ఉందని అన్నారు. దీనిలో గ్రామం, మురికి కాలువలు, రోడ్లు, నీటి కుంటలు ఉన్నాయని అన్నారు. ఈ బస్ స్టాండ్ సెంటర్లో ఉన్న వారికి అప్పట్లోనే అధికారులు పట్టాలు మంజూరు చేయడం జరిగింది అని అన్నారు. ఈ పట్టా భూములలో నిర్మాణం చేయాలి అన్నా అనుమతులు తప్పనిసరి అని అన్నారు. అనుమతులు లేని కట్టడాలను నిలిపి వేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది అని అన్నారు. అధికారులను, ప్రజలను తప్పు దోవ పట్టించే విధంగా ప్రకటనలు చేయవద్దు అని అన్నారు. దీనిపై పంచాయితీ, రెవెన్యూ అధికారులు సమగ్ర నివేదిక జిల్లా కలెక్టర్ గారికి పంపడం జరుగుతుంది అని అన్నారు. ఈ పరిశీలనలో వి ఆర్ ఓ నందీశ్వరరావు, కార్యదర్శి రత్నావళి తదితరులు పాల్గొన్నారు. 

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు