Homeఆంధ్రప్రదేశ్లంక ఏటిగట్టు ప్రాంతాన్ని పరిశీలించిన కడియం ఎంపీపీ

లంక ఏటిగట్టు ప్రాంతాన్ని పరిశీలించిన కడియం ఎంపీపీ

- Advertisement -

విశాలాంధ్ర – కడియం : కడియం మండలం బుర్రిలంక గ్రామంలో గల ఎస్సి  సొసైటీ భూముల వద్ద గల ఏటిగట్టు ప్రాంతాన్ని రూరల్ శాసన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి సూచనల మేరకు కడియం మండల ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్ పరిశీలించారు. ఇటీవల ఏర్పడిన గోదావరి ఉధృతి కారణంగా ఏటిగట్టు కోతకి గురై, పరివాహక ప్రాంతంలో గల ఎస్సీ సొసైటీ భూములు ముంపుకు గురై, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుసుకుని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లనునట్లు తెలిపారు. అలాగే సంబంధిత ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి ఏటిగట్టు నిర్మాణ పనులు తక్షణమే చేపట్టాలని, వచ్చే వేసవికి లంక ప్రాంత భూమాలకు, రైతులుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా శాశ్వత పరిష్కార చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు