Homeఆంధ్రప్రదేశ్మండపానికి కంబాల లక్ష విరాళం

మండపానికి కంబాల లక్ష విరాళం

- Advertisement -

విశాలాంధ్ర – గోకవరం :   గోకవరం గ్రామంలోని అర్టీసీ బస్టాండ్ వద్ద వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన శ్రీ సిద్ధి వినాయక కాంప్లెక్స్ యూత్ భారీ గణపతి మండపానికి విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు లక్ష రూపాయలు విరాళం చెక్కును తంటి కొండ రోడ్డులోని సీఎండీ కార్యాలయం వద్ద కమిటీ సభ్యులకు మంగళవారం  అందజేశారు. ఈ సందర్భంగా కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ వినాయక చవితి నవరాత్రులు మొదటిరోజు బస్టాండ్ వద్ద ఉన్న గణపతి మండపాన్ని దర్శించుకుని వారికి లక్ష రూపాయలు విరాళాన్ని ప్రకటించడం జరిగిందన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం కమిటీ సభ్యులకు విరాళాన్ని అందజేశామన్నారు. గణపతి నవరాత్రి మహోత్సవాలు ప్రతి గ్రామంలో కూడా ఎంతో  ఘనంగా నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుతూ,  తన వద్దకు సహకారం కోసం వచ్చేవారికి ఒక మొక్కను పంపిణీ చేసి మొక్కలను నాటాలని కోరడం జరుగుతుందన్నారు.  ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు, కూటమి నాయకులు దాసరి ధర్మ రాజు, బత్తుల నానాజీ, అచ్చరావు, గాజింగం నాని, ప్రగఢ ప్రభ, పదిలం నాని, వెంకన్న దొర, దాసరి బాలు, దోసపాటి సుబ్బారావు కమిటీ సభ్యులు, యువత తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు