ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయన వ్యక్తి వైఎస్ఆర్
– మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
విశాలాంధ్ర – రాజానగరం : ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయన వ్యక్తి వైఎస్ఆర్ అని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి పురస్కరించుకుని మండల కేంద్రమైన రాజానగరంలోమాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తొలుత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ పేదల పక్షపాతనీ అందుకే సంక్షేమం,అభివృద్ధి ఫలాలు నాడు ప్రతిఒక్కరికీ అందయాని చెప్పారు.ఆరోగ్యశ్రీ ఏర్పాటు చేసి కోట్ల మందికి అరోగ్య ప్రదాతగా నిలిచాలని చెప్పారు. రైతులకు రుణమాఫీ,ఉచిత విద్యుత్, విద్యార్దులకు ఫీజు రియంబర్స్మెంట్, తదితర పథకాలు ప్రవేశ పెట్టిన మహనీయులనీ కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైసీపీ అధ్యక్షులు చెల్లుబోయిన వేణు, మాజీ ఎమ్మెల్యేలు మేకపాటి గౌతం రెడ్డి, శ్రీనివాస్ నాయుడు, తలారి కటరావు,జక్కంపూడి రాజా, జక్కంపూడి గణేష్, మాజీ రుడా ఛైర్మన్ షర్మిల రెడ్డి,ఎంపీపీ మందరాపు వీర్రాజు, జడ్పీటీసీ వాసంశెట్టి పెద్ద వెంకన్న, వైసిపి రాజానగరం మండల కన్వీనర్ దూలంపెద్ద, సర్పంచ్ కుందేటి ప్రసాద్,ఉప సర్పంచ్ కొల్లి వీర్రాజు,
నాయకులు ఆకుల శ్రీను, ప్రగడ చక్రి ,వల్లభశెట్టి వెంకటరమణ,వివిధ గ్రామ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.
సీతానగరం గ్రామంలో ———-
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ 16వ వర్ధంతిని పురస్కరించుకుని మండల కేంద్రమైన సీతానగరంలోవైసిపి సీనియర్ నాయకులు డాక్టర్ బాబు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి.దీనిలో భాగంగా స్తానిక మదర్ థెరిస్సా కూడలి వద్దనున్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు వలవల వెంకటరాజు,గంటా శ్రీనివాసరావు, మాజీ ఎంపీపీ పెందుర్తి దేవదాసు,సర్పంచ్ కొండ్రపు ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా 16వ వర్ధంతి వేడుకలు
- Advertisement -
RELATED ARTICLES


