విశాలాంధ్ర – కడియం : సరికొత్త సంక్షేమ పథకాలను తీసుకువచ్చి ప్రజలకు సుపరిపాలన అందించిన మహా నాయకుడు దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి అని వ్యవసాయ సలహ కమిటీ మాజీ చైర్మన్ ఈలి గోపాలరావు పేర్కొన్నారు. మంగళవారం కడియం మండలం, దోసాలమ్మ కాలనీలో వైయస్సార్ 16 వ వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ముందుగా వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ వంటి పథకాలతో ముఖ్యమంత్రిగా వైయస్సార్ చేసిన సేవలు ప్రజలలో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రజలకు చేసిన పలు సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మార్గాని బలరాం, రెడ్డి శ్రీను, ఆలమూరు శ్రీను, చింతల నూకమణి, గాడి శ్రీను, కాండ్రేగు శ్రీను, ఈలి సుబ్రహ్మణ్యం, తిరుపతి రాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఈలి గోపాలం ఆధ్వర్యంలో ఘనంగా వైఎస్ఆర్ వర్ధంతి
- Advertisement -
RELATED ARTICLES


