విశాలాంధ్ర – కడియం : మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి పురష్కరించుకుని కడియం దేవి సెంటర్ నందు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడియం మండల అధ్యక్షులు సతీష్ చంద్ర స్టాలిన్, పార్టీ శ్రేణులతో కలిసి వై.యస్.ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సేవా కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రం నందు రోగులకు రొట్టెలు, పండ్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా గిరజాల బాబు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, జలయజ్ఞం, ఫీజు రీంబర్స్మెంట్ ఇలా ఎన్నో పథకాలతో, బడి ఈడు పిల్లల నుండి పండు ముసలివారి వరకు సంక్షేమ సారధిగా పేదల ఎదుగుదలకు బాటలు వేసిన మహనీయుడు, దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి అని, భౌతికంగా మనకు దూరం ఉన్నా, వారి పథకాల ద్వారా లబ్ది పొందిన ప్రతి ఒక్కరి చిరునవ్వులో ఎప్పటికి కలకాలం నిలిచి ఉంటారని, తండ్రి బాటలో తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి తండ్రి ఆశయ సాధనకు నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ రాష్ట్ర విభాగ కార్యదర్శి తిరుమల శెట్టి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ దాసరి శేషగిరి, ఎంపీటీసీ సభ్యులు ఆకుల సుధాకర్, బట్టు చిన్ని, పార్టీ నాయకులు కుసునూరి బాబులు, సాకా సతీష్, ఆరెట్టి వెంకట్రావు, లావేటి రమేష్, దొడ్డా బుజ్జి, చిట్టూరి ఏడుకొండలు, బండారు శ్రీనివాస్, పున్నమరాజు వీర్రాజు, దాసరి నాగేంద్ర, కవల వెంకన్న, గుత్తుల రమేష్, నాగిరెడ్డి మోహన్, శాకా కిరణ్, పూడి వీర బ్రహ్మం, దంగడు బియ్యం సుబ్బారావు, బిల్లాగుర్తి ముత్యాలరావు, చిలుకూరి రామకృష్ణ, ఎస్.వీరనాగు, కొమ్మూ సత్తియ్య, బత్తిన శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
జనం గుండెల్లో సంక్షేమ శ్రామికుడు మహానేత వైఎస్సార్
- Advertisement -
RELATED ARTICLES


