విశాలాంధ్ర — దేవరపల్లి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం కొణిదెల. పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు దేవరపల్లి మండల జనసేన పార్టీ సీనియర్ నాయకులు అనిశెట్టి. గంగరాజు ఆధ్వర్యంలో దేవరపల్లి మండలం కృష్ణం పాలెం లో గలడాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మెమోరియల్ ట్రస్ట్ వృద్ధాశ్రమంలో ఏర్పాటు చేయడం జరిగింది, యాదవోలు గ్రామ గ్రామానికి చెందిన జనసేన పార్టీ యువ నాయకులు అనిశెట్టి. ప్రసన్న కుమార్ వృద్ధాశ్రమంలో వృద్ధులందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. మరియు ఆశ్రమ నిర్వహణకు పాతిక వేలు విరాళాన్ని ఆశ్రమ నిర్వాహకురాలు గుదే శ్యామల దేవికి అందజేశారు, ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు అనిశెట్టి గంగరాజు, అనిశెట్టి శ్రీనివాస్, పోతుల కనకరాజు, బల్ల రాము, చిలక సత్యనారాయణ, తుమ్మల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
అనిశెట్టి ఆధ్వర్యంలో పవన్ జన్మదిన వేడుకలు
- Advertisement -
RELATED ARTICLES


