Wednesday, February 18, 2026
Homeఆంధ్రప్రదేశ్లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు సన్మానం

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు సన్మానం

- Advertisement -

విశాలాంధ్ర – కొవ్వూరు : సమ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులు పాత్ర కీలకమైనదని, విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు మార్గదర్శకులు ఉపాధ్యాయులని అటువంటి ఉపాధ్యాయలను గౌరవించవలసిన బాధ్యత అందరి పైన ఉందని లైన్స్ క్లబ్ అధ్యక్షులు పెనుమాక జయరాజు అన్నారు. సెప్టెంబర్ 5వ తేదీ గురు పూజ్యులు మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా జరుపుకొను ఉపాధ్యాయ దినోత్సవాన్ని సెలవు దినం కావడంతో లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం కొవ్వూరు పట్టణంలోని అల్లూరి నాగరత్నం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నందు కొవ్వూరు లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లైన్స్ క్లబ్ జోన్ చైర్ పర్సన్ ఎనమదల సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా విచ్చేసి ఉపాధ్యాయులను సత్కరించారు . ఈ సందర్భంగా జోన్ చైర్ పర్సన్ యనమదల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ భావితరాల బంగారు భవిష్యత్తుకు మార్గదర్శకులు ఉపాధ్యాయులు అన్నారు. ప్రతి చిన్నారికి తల్లి తండ్రి దైవ సమానులని అటువంటి దైవ సమానులైన మూడో వ్యక్తి ఉపాధ్యాయుడు అని అన్నారు. గురువు లేని విద్య దేనికి పనికిరాదని, తెలిపారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు లైన్స్ క్లబ్ అధ్యక్షులు పెనుమాక జయరాజు, సభ్యులు మహమ్మద్ హుస్సేన్, బూరుగుపల్లి వెంకటేశ్వరరావు కలగర వెంకటరావు, ప్రధానోపాధ్యాయులు రామానుజన్, ఉపాధ్యాయులు మన శ్రీ, తదితర ఉపాధ్యాయులు విద్యార్థిని , విద్యార్థులు లైన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు