విశాలాంధ్ర — దేవరపల్లి : దేవరపల్లి మండలం పల్లంట్లలో బుధవారం నాడు వినాయక చవితి నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఆలయం వద్ద భారీ స్థాయిలో అన్న సమారాధన జరిగింది. ఈ సందర్భంగా వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పల్లంట్ల గ్రామానికి చెందిన గ్రంధి ప్రభాకర్ శెట్టి దంపతులు, మనవరాలు వాగ్దేవి మిత్ర, మనుమడు రుద్ర కార్తికేయ సహకారంతో అన్న సమారాధన జరిగింది, పల్లంట్ల, కురుకూరు గ్రామానికి చెందిన భక్తులు అన్న సమారాధన లో పాల్గొన్నారు. శివ గణేష్ యూత్ సభ్యులు మేడికొండ మణికంఠ, దారం గోపి, నూతలపాటి ప్రవీణ్, మందపాటి వేణు, కామన ధర్మ , మేడికొండ శ్రీరామ్, కొడమంచిలి సతీష్, స్థానిక పురోహితులు మొక్కపాటి శ్రీనివాసరావు, ఆల్ ఇండియా విష్ణు సహస్రనామ ఫెడరేషన్ డైరెక్టర్ బలుసు సత్యనారాయణ విజయలక్ష్మి దంపతులు, స్థానిక భక్తులు పాల్గొన్నారు.
పల్లంట్ల లో వినాయక అన్న సమారాధన
- Advertisement -
RELATED ARTICLES


