Homeజిల్లాలుశ్రీ సత్యసాయిభ్రూణహత్యలు లేని ధర్మవరము డివిజన్ గా తీర్చిదిద్దుదాం.. ఆర్డిఓ మహేష్

భ్రూణహత్యలు లేని ధర్మవరము డివిజన్ గా తీర్చిదిద్దుదాం.. ఆర్డిఓ మహేష్

- Advertisement -

విశాలాంధ్ర- ధర్మవరం : బృణ హత్యలు లేని ధర్మవరం డివిజన్ గా తీర్చిదిద్దాలని ఆర్డిఓ మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ శ్రీ సత్య సాయి జిల్లా ఆదేశాల మేరకు, పిడి ఐసిడిఎస్ ప్రమీల సూచనల మేరకు ధర్మవరం నందు ఏఎన్ఎం, ఆశా వర్కర్స మరియు అంగన్వాడి వర్కర్స్ కు పిసి అండ్ పి ఎన్ డి టి యాక్ట్ 1994 పైన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆర్డిఓ మాట్లాడుత బ్రుణ హత్యలు లేకుండా చూడాల్సిన బాధ్యత అందరి పైన ఉన్నది, అలాగే అబార్షన్ సమాచారం గ్రామంలో గాని , వార్డ్స్ లో ఉన్న అంగనవాడి వర్కర్స్, ఏఎన్ఎం కు ఈ సమాచారం తెలియకుండా ఉండదు, అబార్షన్ కు సంబంధించిన సమాచారం పై అధికారులకు తెలియజేయాలని వారు ఆదేశించారు. అనంతరం సిడిపిఓ మాట్లాడుతూ అబార్షన్లు చేయించుకునే సమాచారాన్ని కచ్చితంగా అంగన్వాడి వర్కర్స్ పైన అధికారులకు తెలియజేయవలసిందిగా తెలిపారు. జిల్లా బాలల పరిరక్షణ అధికారి మహేష్ మాట్లాడుతూ బాలికల సంరక్షణ, బాల్య వివాహాల పైన అవగాహన కల్పించారు. పిల్లలను జాగ్రత్తగా సంరక్షించాల్సిన బాధ్యత తల్లిదండ్రుల పైన ఉందని తెలిపారు, ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు పిల్లలతో తరచుగా మాట్లాడుతూ ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సిడిపిఓ లక్ష్మి, బాలల పరిరక్షణ అధికారి మహేష్, మెడికల్ ఆఫీసర్ మురళి నాయక్, ప్రొటెక్షన్ ఆఫీసర్ మురళీధర్, ఐసిడిఎస్ సూపర్వైజర్ గంగాభవానీ, డీసీపీయూ సిబ్బంది , ఏఎన్ఎంలు,ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు