Wednesday, January 14, 2026
Homeజిల్లాలుశ్రీ సత్యసాయివిద్యతో పాటు విలువలు, సంస్కారం విద్యార్ధి దశలో నేర్చుకోవాలి…

విద్యతో పాటు విలువలు, సంస్కారం విద్యార్ధి దశలో నేర్చుకోవాలి…

- Advertisement -

సత్యసాయి జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్షులు గాజుల సోమేశ్వర్ రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం : విద్యతోపాటు విలువలు సంస్కారం విద్యార్థి దశలోనే నేర్చుకోవాలని శ్రీ సత్యసాయి జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్షులు గాజుల సోమేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మానవత స్వచ్చంద సేవా సంస్థ ధర్మవరం శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులలో విలువలు పెంపొందించుటకు ప్రతిభ పాటవ పోటీలు,వ్యాసరచన పోటీ లను పట్టణంలోని ఆదిత్య హైస్కూల్లో నిర్వహించారు. అంశం:జన్మనిచ్చిన తల్లిదండ్రులకు విద్యాబుద్దులు నేర్పిన గురువులకు విద్యార్ధి దశలో ఆచరించదగిన విషయాలుపై ఆదిత్య హైస్కూల్ విద్యార్థులకు నిర్వహించడం జరిగింది. అనంతరం
ప్రతిభ కల్గిన విద్యార్థులకు
ప్రథమశ్రేణి :ఎన్.శిరిలక్ష్మి (8వ తరగతి ),
ద్వితీయశ్రేణి :డి.కీర్తన కాత్యాయని (8వ తరగతి ),
తృతీయశ్రేణి :ఎం. రమ్యతేజ (8వ తరగతి ),
వారికి బహుమతులు సర్టిఫికెట్స్ సత్యసాయి జిల్లా యోగ అసోసియేషన్ అధ్యక్షులు గాజుల సోమేశ్వర్ రెడ్డి చేతులు మీదుగా అందచేశారు. గాజుల సోమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ క్రమశిక్షణ కలిగిన చదువు భావితరాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. విద్యార్థులందరూ కూడా ఇష్టపడి కష్టపడి చదివినప్పుడే అనుకున్న లక్ష్యం నెరవేరుతుందని తెలుపుతూ హర్షం తెలియజేసారు. ఈ కార్యక్రమంలో మానవత స్వచ్చంద సేవా సంస్థ వైస్ ప్రెసిడెంట్ మంజునాథ్,సెక్రెటరీ కోనాపురం సాయిప్రసాద్, అకాడమీక్ ఇంచార్జ్ జబివుల్లా మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు