విశాలాంధ్ర-తాడిపత్రి ( అనంతపురం జిల్లా) : పట్టణంలోని పెద్ద బజార్ లో ఉన్న స్వర్ణకారుల సంక్షేమ సంఘం కార్యాలయం వద్ద శుక్రవారం మిలాద్ నబీ సందర్భంగా స్వర్ణకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు జాకీర్ హుస్సేన్ ఆధ్వర్యంలో స్వర్ణకారులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జాకీర్ హుస్సేన్ మాట్లాడుతూ మొహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు, మిలాద్ నబీ సందర్భంగా ప్రతి స్వర్ణకారుడు సంతోషంగా మిలాద్ నబీ పండగ వేడుకలు జరుపుకోవాలని ఉద్దేశంతో తమ వంతు సహాయంగా స్వర్ణకారుల సంక్షేమ సంఘం సభ్యుల సహాయ, సహకారాలతో దాదాపు 22 మంది స్వర్ణకారులకు ఒక ప్యాకెట్ బియ్యం, నిత్యవసర సరుకులు పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో స్వర్ణకారుల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు టిఎం. షబ్బీర్, ఎస్. బషీర్ భాష, సెక్రటరీ సలీం భాష, ట్రెజరర్ ఖాజా, గౌరవ సలహాదారుడు తాజుద్దీన్, మఖుబ్బుల్ బాషా, శామీర్ భాష, నజీర్ హుస్సేన్, పీరా, ఇక్బాల్, సయ్యద్ తదితర స్వర్ణకారులు పాల్గొన్నారు.


