- Advertisement -
విశాలాంధ్ర -అనంతపురం : రూడ్ సెట్ సంస్థలో ఈనెల 15 మరియు 16 తేదీలలో మహిళలకు టైలరింగ్ మరియు జర్దోసి మగ్గం వర్క్ నందు ఉచితంగా శిక్షణ ప్రారంభమవునని డైరెక్టర్ శ్రీమతి విజయలక్ష్మి శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. శిక్షణ కాలంలో శిక్షణ తో పాటు ఉచిత భోజనం మరియు వసతి కూడా ఉచితంగా కల్పించబడునని తెలియజేశారు. ఈ శిక్షణకు ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన గ్రామీణ ప్రాంత నిరుద్యోగ మహిళలలో అర్హులు అయినా ఉమ్మడి అనంతపురం జిల్లాలో రేషన్ కార్డ్, ఆధార్ కార్డు కలిగి ఉండి వయసు 18 నుండి 45 సంవత్సరాలు ఉండాలని, మరిన్ని వివరాలకు మరియు పేర్లు నమోదు కొరకు ఈ నంబర్ ను 9492583484 సంప్రదిచలన్నారు.


