Homeజిల్లాలుఅనంతపురంనిరుపేదలకు అందాల్సిన బియ్యం పట్టివేత

నిరుపేదలకు అందాల్సిన బియ్యం పట్టివేత

- Advertisement -

విశాలాంధ్ర -పామిడి : అనంతపురం జిల్లా పామిడి మండల పరిధిలోని జి కొట్టాల గ్రామ సమీపంలోని కొండల దాపున అక్రమంగా నిలువ ఉంచిన పిడిఎఫ్ స్టోర్ బియ్యాన్ని పోలీసులు రెవెన్యూ అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం సాయంకాలం పామిడి విలేకరులు నిలువ మించిన అక్రమ బియ్యం గూర్చి రెవెన్యూ అధికారులకు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రాత్రి 10 గంటల సమయంలో పోలీసులు నిలువ ఉంచిన స్థలానికి వెళ్లి డంపు చేసిన బియ్యాన్ని స్వాధీనం చేసుకుని స్టేషనుకు తరలించారని సమాచారం. శనివారం రెవెన్యూ అధికారులు పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసుల ఆధీనంలో ఉన్న 40 బస్తాలు 12 క్వింటాల బియ్యంను సీజ్ చేసి గుంతకల్ స్టాక్ పాయింట్ కి తరలించినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు.శుక్రవారం దాదాపు 120 బస్తాలు ఉండేవని అందులో 40 బస్తాలు మాత్రమే అధికారులు చూపిస్తారని మిగతా బస్తాల బియ్యం ఏమైనట్లని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సమాచారం అందిన వెంటనే స్పందించి పోలీసులు రెవెన్యూ అధికారులు డంపు స్థలానికి చేరుకొని ఉంటే మొత్తం బియ్యం పట్టుబడేవని, రాత్రి 10 గంటలకు చేరుకునే లోపు ఒక ట్రాక్టర్ తో వేరే ప్రాంతానికి తరలించారని ప్రజలు వాపోతున్నారు. దొంగలుబడ్డ ఆరు నెలలకు మొరిగినట్లు ప్రభుత్వ అధికారుల తీరు ఉన్నదని ఉన్నదని ప్రజలు ఆవేదన వ్యక్త పరుస్తున్నారు. ఇప్పటికైనా నిరుపేదల బియ్యం ఇతర ప్రాంతాలకు రాష్ట్రాలకు తరలి వెళ్లకుండా నిఘాబృందాలను మెరుగుపరచాలని ప్రజలు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు