Homeజిల్లాలుఅనంతపురంమెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ గా ఆచార్య డాక్టర్ ఎం విజయశ్రీ బాధ్యతలు స్వీకరణ

మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ గా ఆచార్య డాక్టర్ ఎం విజయశ్రీ బాధ్యతలు స్వీకరణ

- Advertisement -

విశాలాంధ్ర- అనంతపురం : అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాల 17 వ ప్రిన్సిపాల్ గా ఆచార్య డాక్టర్ ఎం విజయ శ్రీ పదవి బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ లోని సిద్ధార్థ మెడికల్ కళాశాలలో పేథాలజీ ప్రధాన విభాగాధిపతిగా పనిచేసిన డాక్టర్ ఎం విజయశ్రీ కి అదనపు వైద్య విద్యా సంచాలకులు మరియు ప్రిన్సిపాల్ గా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు అవకాశం ఇవ్వగా నేడు పూర్వ ప్రిన్సిపల్ ఆచార్య డాక్టర్ షారోన్ సోనియా నుంచి పూర్తి బాధ్యతలను తీసుకున్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలోని అన్ని విభాగాల వైద్యులు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, ఆఫీసు సిబ్బంది పుష్పగుచ్చాలతో నూతన ప్రిన్సిపాల్ కు శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో పూర్వ ప్రిన్సిపల్ ఆచార్య డాక్టర్ షారోన్ సోనియా, వైస్ ప్రిన్సిపాల్ ఆచారి డాక్టర్ శంకర్, ఆఫీసు పర్యవేక్షకులు అతావుళ్ళ, మౌలా సాబ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు