Homeజిల్లాలునెల్లూరుభారత దిగుమతులపై ట్రంప్ సుంకాలను వ్యతిరేకించాలి

భారత దిగుమతులపై ట్రంప్ సుంకాలను వ్యతిరేకించాలి

- Advertisement -

అరిగెలసాయి సిపిఐ జిల్లా కార్యదర్శి
విశాలాంధ్ర బ్యూరో- నెల్లూరు:భారతదేశ దిగుమతుల పైన అమెరికా విధిస్తున్న 50 శాతం సుంకాలను వ్యతిరేకించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి అరిగెలసాయి అన్నారు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదలచేస్తూ దిగుమతుల పట్ల అమెరికా విధిస్తున్న పన్నులు దుర్మార్గమని అయినా అధికారంలో ఉన్న మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం ట్రంప్ విధానాలను ఎందుకు వ్యతిరేకించలేకపోతుందో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ట్రంప్ చేతిలో కీలుబొమ్మగా మారిన మోడీ మౌనందేశ సార్వభౌమత్వాన్ని ప్రశ్నార్థకం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా విధిస్తున్న దిగుమతి సుంకాల వల్ల భారతదేశంలోని ప్రధాన ఆదాయ వనరులైన ఆక్వా రంగం టెక్స్టైల్ రంగం తో పాటు అనేక రంగాలు కుదేలైపోతున్నాయని, అయినా గాని ప్రధాని, ఆర్థిక మంత్రి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవ
హరించడం సరికాదన్నారు. నిత్యవసర సరుకుల ధరల మీద జిఎస్టిని తగ్గించకపోతే ప్రజలు వారి కొనుగోలు సామర్థ్యాన్ని కోల్పోతారని భారతకమ్యూనిస్టుపార్టీ ఎప్పటినుంచో చెప్తున్నా వారి మాటలు పెడచెవిన పెట్టి
ఈ రోజున మళ్ళీఆర్థిక రంగంలో ఏర్పడినటువంటి అవకతవకలను సరిచేసుకునేందుకు జీఎస్టీ నితగ్గిస్తామని చెప్పడం ప్రభుత్వానికి దార్శనికత లేదని తెలియజేస్తుందన్నారు.కమ్యూనిస్టులను చైనా రష్యాలకు తొత్తులుగా విమర్శించే మిథ్యా దేశ భక్తులకు ఈ రోజున వారి సహకారం లేకపోతే భారత ఆర్థిక పరిస్థితి ఏంటి అనేది ఆలోచన చేయాలని హితవు పలికారు. ఎప్పటికైనా భారతదేశానికి శాశ్వత మిత్రులు సోషలిస్ట్ దేశాలని అమెరికా లాంటి సామ్రాజ్యవాద దేశాలు కాదని ఇకనైనామోడీ ప్రభుత్వం మౌన
ము వీడి ట్రంప్ నాయకత్వంలోని అమెరికా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడా
లని తద్వారా దేశ సార్వభౌమత్వాన్ని కాపాడాలని అరిగెల సాయికోరారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు