విశాలాంధ్ర- ధర్మవరం; సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని ధర్మవరం పట్టణంలోని ఎన్జీవో హోం కార్యాలయం నందు సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం రోజున ఆత్మీయ ట్రస్ట్ ఆధ్వర్యంలో యుటిఎఫ్ ధర్మవరం జోన్ సహకారంతో ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా వివిధ కేడర్లలో విశేష సేవలు అందిస్తున్న 67 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను అందజేయనున్నట్లు ఆత్మీయ ట్రస్ట్ చైర్మన్ ,యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వాహకులు స్థానిక ఎన్జీవో కార్యాలయం ముందు సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ఆత్మీయ ట్రస్ట్ , యుటిఎఫ్ ధర్మవరం జోన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటుడు వెల్లంకి నాగినీడు ముఖ్యఅతిథిగా పాల్గొంటారని తెలిపారు. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ విద్యారంగా పరిరక్షణ కోసం , బోధనలో విశేషమైన సేవలు అందిస్తూ విద్యార్థుల భవితకు బాటలు వేస్తున్న 67 మంది ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులను ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు ఎంపిక చేసినట్లు తెలిపారు. కాబట్టి ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు అందరూ స్వచ్ఛందంగా పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రామకృష్ణ నాయక్, యూటీఎఫ్ నాయకులు ఆంజనేయులు, హరికృష్ణ, వెంకట కిషోర్, అమర్ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు
7న ఆత్మీయ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల ప్రదానోత్సవం
- Advertisement -
RELATED ARTICLES


