Homeఆంధ్రప్రదేశ్ఆశ్రయ ఫౌండేషన్ నూతన భవనం ప్రారంభం

ఆశ్రయ ఫౌండేషన్ నూతన భవనం ప్రారంభం

- Advertisement -

విశాలాంధ్ర – కొవ్వూరు : తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం కొవ్వూరు నుండి నందమూరి వెళ్లే రోడ్డులో ఆర్టీవో కార్యాలయం దగ్గర్లో ఆశ్రయ ఫౌండేషన్ నూతన భవనాన్ని జూబ్లీహిల్స్ రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ గవర్నర్ రాంప్రసాద్ రోటరీ క్లబ్ సభ్యులు ఆశ్రయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు పల్లవి విజయ్ కుమార్, మాధురి కలిసి ప్రారంభించారు. అనంతరం పల్లవి విజయకుమార్ మాట్లాడుతూ ఆఖరి దశలో ఉండి వైద్యం పొందుతున్న వారికి అన్ని సదుపాయాలు కల్పించి వైద్యం చేస్తామని 20 బెడ్లు ఉండేవని ఇప్పుడు 40 బెడ్ల వరకు పెంచామని రోటరీ క్లబ్ సహకారంతో ఈ ఆశ్రయ ఫౌండేషన్ నడుస్తుందని జూబ్లీహిల్స్ రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ 3150 గవర్నర్ రాంప్రసాద్ మాట్లాడుతూ ఆశ్రయ ఫౌండేషన్ వ్యవస్థాపనకు అభినందనలు తెలియజేశారు రోటరీ క్లబ్ ద్వారా ఒక అంబులెన్స్ కూడా ఉచితంగా ఇచ్చామని ఆయన తెలియజేశారు. పల్లవిమాధురి మాట్లాడుతూ ఉచితంగా వైద్యం చేస్తున్నామని క్యాన్సర్ రోగులకు దీర్ఘకాల రోగాలు ఉన్నవారికి ఫ్రీ వైద్యం చేస్తున్నామని అన్నారు.ఉంది. ఈ ఫౌండేషన్ ప్రాణాంతకమైన వ్యాధుల బారి పడిన రోగులను ఆదుకునే అమృత హస్తమని క్యాన్సర్ పక్షవాతం వంటివి దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతూ ఆదరించేవారు లేక అనేక సమస్యలతో ఉన్న పేషెంట్లను అమ్మల ఆదరించడమే ఆశ్రయ ఫౌండేషన్ లక్ష్యమని 2019 వ సంవత్సరంలో కొవ్వూరు పట్టణంలో ఆశ్రయ ఫౌండేషన్ ఏర్పాటు చేసామని దాతల సహకారంతో నూతన భవనాన్ని ఏర్పాటు చేశామని దాతలు డొనేషన్స్ ఇస్తే సికరించబడతాయని దాతలు రోగులకు వస్త్రాలు ఆహారము అందించవచ్చు అని కాన్సర్ 4వ స్టేజి లో వచ్చింప్పుడు ఎండ్ ఆఫ్ లైఫ్ కేర్ మేము తీసుకుంటాం * పేషంట్ కు పెయిన్ స్పెషలిస్ట్ తో ట్రీట్మెంట్ ఇప్పిస్తాం పేషంట్ కి కౌన్సిలింగ్ ఇచ్చి ధైర్యాన్ని సమకూరుస్తాం పబ్లిక్ అవేర్నెస్ కల్పించడం
క్యాన్సర్ వంటి తీవ్ర అనారోగ్యాలతో పోరాడి ఉన్నవారికి వారి సేవలు అందించడమే దీని ప్రత్యేకత అని క్యాన్సర్ అంతిమ దశలో ఉన్న ఏ వయసులో ఎవరైనా ఈ ఆశ్రమంలో ఆశ్రమం కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ గవర్నర్ రాంప్రసాద్ , ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్ సాంబశివరావు ,అన్నే రత్న ప్రభాకర్, వి బి కే రెడ్డి పంగళూరు కళ్యాణ్, రోటరీ క్లబ్ జూబ్లీహిల్స్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ , మధిర అండ్ పల్లవి మధిర ట్రస్టిఎస్ , ఆశ్రయ ఫౌండేషన్ హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోటరీ క్లబ్ సభ్యులు, ఫౌండేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు