Homeఆంధ్రప్రదేశ్బ్యారేజ్ గేట్లు మరమ్మత్తుల పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే ముప్పిడి

బ్యారేజ్ గేట్లు మరమ్మత్తుల పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే ముప్పిడి

- Advertisement -

విశాలాంధ్ర -కొవ్వూరు మండలం మద్దూరు రైతులకు అండగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు.మద్దూరు విజ్జేశ్వరం కెనాల్ బారేజ్ గేట్లు అత్యవసర మరమ్మత్తు పనులను కూటమి నాయకులతో కలిసి శనివారం ప్రారంభించిన శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు. రూ. 7.50 లక్షలు వ్యయంతో చేపట్ట పోయేపనికి కొబ్బరికాయ ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ రైతుల పంట పొలాలకు నీరు నిలవంచ చేయడానికి ఈ గేట్లు కీలకమని గత వైసిపి ప్రభుత్వం ఈ కెనాల్ గేట్లను పట్టించుకోలేదని దీనివల్ల రైతుల చాలా ఇబ్బంది పడ్డారని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎత్తిపోత పథకాలను అభివృద్ధి చేస్తున్నామని రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందనిఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్ సురపనేని చిన్ని, కాకర్ల నారాయుడు, కాపవరం సొసైటీ అధ్యక్షులు సుంకర సత్తిబాబు బిజెపి రూరల్ అధ్యక్షురాలు డేగల సునీత, కూటమి నాయకులు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు