- Advertisement -
విశాలాంధ్ర – కొవ్వూరు: పేదల శ్రేయస్ లక్ష్యంగా సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నామని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పెండ్యాల అచ్యుత రామయ్య (అచ్చిబాబు ) అన్నారు.కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామంలో 6 గురు లబ్ధిదారులకు రు. 6.95 లక్షల విలువగల చెక్కులను పెండ్యాల అచ్యుత రామయ్య (అచ్చిబాబు) తెలుగుదేశం నాయకులతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సంక్షేమగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు..ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.


