విశాలాంధ్ర-కొవ్వూరు: రాష్ట్రస్థాయిలో వామపక్ష పార్టీలు ఇచ్చిన నిరసన పిలుపుమేరకు కొవ్వూరు పట్టణంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో భారతదేశంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన 50 శాతం సుఖాలను వెంటనే ఎత్తివేయాలని ఆందోళన కార్యక్రమం శనివారం జరిగింది. ఈ ఆందోళన కార్యక్రమాన్ని ఉద్దేశించి పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నంబూరి శ్రీమన్నారాయణ మాట్లాడుతూ భారతదేశ సార్వభౌమత్వం విషయాలలో ట్రంపు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని వీటిని వెంటనే భారత పార్లమెంటు నిరసిస్తూ తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ట్రంపు విధించిన 50 శాతం సుఖాల వల్ల భారత దేశ వ్యవసాయ రంగం తీవ్ర ప్రభావం చూపుతోందని అన్నారు టెక్స్టైల్స్ మరియు ఆటో మొబైల్ రంగాలు తీవ్రంగా నష్టపోతాయని ప్రజల భారత దేశ ప్రజల జీవితాలు అతలాకుతలం అవుతాయని అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే విధంగా అమెరికా విదేశాంగ విధానం ఉందని భారత పార్లమెంటు స్పందించి రాష్ట్రపతి ప్రధానమంత్రి అమెరికా విదేశాంగ విధానానికి నిరసన తెలియజేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్క వెంకటరత్నం మాట్లాడుతూ దేశభక్తి పరులు అయినటువంటి దేశ ప్రజలు అమెరికా అధ్యక్షుడు ట్రంపు చర్యలను నిరసిస్తూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు వ్యవసాయ రంగాన్ని పరిరక్షించుకోవడం కోసం రైతును పరిరక్షించుకోవడం కోసం ముందుకు వచ్చి ఆందోళన చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం పిఓడబ్ల్యు జిల్లా కార్యదర్శి ఈ మని మల్లికా మాట్లాడుతూ ప్రభుత్వం అమెరికాకి లొంగిపోతుందని ఆరోపించారు ట్రంపు మోడీ మంచి మిత్రులు అని ప్రకటించుకోవడం వెనుక భారతదేశ ప్రజల దోపిడీ చేసేటటువంటి కుట్ర అమెరికాకు ఉందని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో ఐ ఎఫ్ టి యు నాయకులు బాబి, రామకృష్ణ, కోటి చుక్కల రాము, భూషణం, నాగేశ్వరరావు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు
ట్రంప్ వ్యాఖ్యలపై వామపక్షాలు నిరసన ర్యాలీ
- Advertisement -
RELATED ARTICLES


