విశాలాంధ్ర – సీతానగరం: ప్రజా సమస్యల పరిష్కార వేదికగా జనవాణిని నిర్వహిస్తున్నామని రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అన్నారు. మండలంలో శుక్రవారం నాగంపల్లి, చీపురుపల్లి గ్రామ పంచాయతీల పరిధిలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో జానవాణిలో మన ఊరు – మన ఎమ్మెల్యే – మన పల్లెబాటగా నిర్వహించారు. ఈ జనవాణిలో గ్రామ ప్రజలు పలు సమస్యల పై అర్జీలను ఎమ్మెల్యే స్వయంగా స్వీకరించారు. దీనిలో భాగంగా ఉచిత వైద్య శిబిరంను ఎమ్మెల్యే సతీమణి నా సేన నా వంతు కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి ప్రారంబించారు. ఈ శిబిరం ద్వారా కంటి, డెంటల్ సంబంధిత పరీక్షలను చేసి మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకూ సుపరిపాలనే లక్ష్యంగా సాగుతుందని అని అన్నారు. ప్రజల వద్ద నుండి స్వీకరించిన అర్జీలను అధికారులు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. అలాగే గ్రామాలలో కాలి నడక ద్వారా పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ ఏ శ్రీనివాస్, ఎంపిడిఓ ఎమ్ భారతి, అగ్రికల్చరల్ ఏ ఓ గౌరీ దేవి, అదనపు హౌసింగ్ ఏ ఈ సుబ్రమణ్యం, పంచాయతీ కార్యదర్శిలు, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదికగా జనవాణి
- Advertisement -
RELATED ARTICLES


