Homeఆంధ్రప్రదేశ్నానో యురియా రైతులకు చాలా లాభదాయకం

నానో యురియా రైతులకు చాలా లాభదాయకం

- Advertisement -

విశాలాంధ్ర – సీతానగరం: నానో యురియా రైతులకు చాలా లాభదాయకం అని మండల వ్యవసాయ అధికారిని గౌరీ దేవి అన్నారు. శనివారం మండలంలో చినకొండేపూడి గ్రామ సొసైటీ ప్రాంగణంలో వ్యవసాయ శాఖ ఏ ఓ గౌరీ దేవి ఆధ్వర్యంలో సొసైటీ చైర్మన్ కాండ్రు శేఖర్ ముఖ్య అతిథిగా రైతులకు నానో యురియా వాడకం వల్ల కలిగే ప్రయోజనాలు పై అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఓ గౌరీ దేవి మాట్లాడుతూ ఒక బాటిల్ నానో యురియా (500 ఎమ్.ఎల్.) ఒక బస్తా (45 కెజి.) సాధారణ యురియాను సమర్ధవంతంగా భర్తీ చేస్తుంది. నానో యురియా(లిక్విడ్) నత్రజని యొక్క ప్రత్యేక మూలం. ఇది పచ్చదనం, శక్తివంతమైన పెరుగుదల, మొత్తం పంట అభివృద్ధికి బాధ్యత వహిస్తుందని అన్నారు. యురియాను అధికంగా వాడటం వలన తెగుళ్ళు, కీటకాల దాడి ఎక్కువగా ఉంటుంది, పంట పరిపక్వత ఆలస్యం కావడం, పోషకాల లోపం మరియు అధిక పెరుగుదల ఉంటుంది. సాంప్రధాయ యురియూ లో ఉండే నత్రజని కేవలం 25-30 శాతం మాత్రమే మొక్కకు అందుబాటులో ఉండి మిగిలిన నత్రజని వివిధ రూపాలలో వ్యర్ధమవుతుంది. నానో  యురియా యొక్క చిన్న పరిమాణం (20-50ఎన్ ఎమ్) వలన పంటకు నత్రజని లభ్యతను 80 శాతం కన్న ఎక్కువ పెంచుతుంది. అంతేకాకుండా ఆకులపై స్ప్రే చేసినప్పుడు, నానో యురియా సులభంగా పత్రరంధ్రాల ద్వారా మొక్కలోనికి ప్రవేశిస్తుంది. మొక్క అవసరానికి అనుగుణంగా మొక్కలోపలి కణజాలం నుండి నత్రజనిని తీసుకుంటుంది. సరైన మొక్కల పెరుగుదల, అభివృద్ధి కోసం నెమ్మదిగా విడుదల అవుతుంది. కావున రైతులు నానో యురియా వాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విఏఏలు సొసైటీ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు