ప్రజాప్రతినిధి అంటే ప్రజల కోసం పనిచేసే వ్యక్తి. అది మరిచిపోయిన ఓ నేత.. ప్రజల చేతనే పని చేయించుకున్నాడు. బిహార్‌లో అక్కడి ఒక కాంగ్రెస్ ఎంపీ, ప్రజలతో కలిసి పని చేయించుకోవడం కన్నా ఎక్కువ ఓవరాక్షన్ చేశారు.బీహార్‌లోని కతిహార్‌లో వరద ముంచెత్తింది. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు వచ్చిన కాంగ్రెస్ ఎంపీ తారిఖ్ అన్వర్, గ్రామస్తుల భుజంపై ఎక్కి వరద ప్రభావిత ప్రాంతాలను చూశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవడం వల్ల పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.
రాష్ట్రంలో ఎన్నికల ఫీవర్
ఇటీవల బీహార్‌లో భారీ వర్షాలు కురిసిన తర్వాత గంగా, కోసి, గండక్, ఘాగ్రా నదులు తీవ్రమైన వరదలకు గురయ్యాయి. దీంతో లక్షలాది ప్రజలు వరద ముప్పు ఎదుర్కొన్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలో ఎన్నికల ఫీవర్ కొనసాగుతోంది. ఇలాంటి సందర్భాల్లో నాయకుల ప్రవర్తన కారణంగా పార్టీకి ప్రతికూల ప్రభావం పడుతుందని ఈ సంఘటన సూచిస్తుంది.


