Homeఅంతర్జాతీయంరెండో దశ ఆంక్షలకు సిద్ధం..

రెండో దశ ఆంక్షలకు సిద్ధం..

- Advertisement -

భారత్ వంటి దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గట్టి హెచ్చరికలు
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్ వంటి దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గట్టి హెచ్చరికలు పంపారు. రష్యాపై రెండో దశ ఆంక్షలు విధించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఈ చర్యలు రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాలను కూడా లక్ష్యంగా చేసుకుంటాయని ఆయన పరోక్షంగా సూచించారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని ప్రభుత్వ భవనంపై రష్యా భారీ వైమానిక దాడి జరిపిన నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.రష్యాపై లేదా రష్యా నుంచి ఆయిల్ కొనే దేశాలపై కొత్త ఆంక్షలకు మీరు సిద్ధంగా ఉన్నారా? అని వైట్‌హౌస్‌లో విలేకరులు అడిగిన ప్రశ్నకు ట్రంప్.. ఁఅవును, నేను సిద్ధంగా ఉన్నానుఁ అని ఒక్క మాటలో సమాధానమిచ్చారు. అయితే, ఆ ఆంక్షల స్వరూపంపై ఆయన ఎలాంటి వివరాలూ వెల్లడించలేదు. యుద్ధం సుదీర్ఘంగా కొనసాగుతుండటం, శాంతి ప్రయత్నాలు విఫలం కావడంతో అమెరికా ప్రభుత్వంలో అసహనం పెరుగుతోందని ఈ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. ఈ అంశంపై అమెరికా ఆర్ధిక మంత్రి స్కాట్ బెస్సెంట్ మరింత స్పష్టతనిచ్చారు. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకునే దేశాలపై అమెరికా, యూరోపియన్ యూనియన్ కలిసి ాసెకండరీ టారిఫ్‌లు్ణ విధించే అవకాశం ఉందని ఓ టీవీ ఛానెల్‌కు తెలిపారు. రష్యా ఆర్థిక వ్యవస్థను పూర్తిగా కుప్పకూల్చడం ద్వారానే అధ్యక్షుడు పుతిన్‌ను చర్చల టేబుల్‌పైకి తీసుకురాగలమని ఆయన అభిప్రాయపడ్డారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు