Homeజిల్లాలుతూర్పు గోదావరిఅంబులెన్స్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే ముప్పిడి 

అంబులెన్స్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే ముప్పిడి 

- Advertisement -

విశాలాంధ్ర- కొవ్వూరు  ప్రజలకు మరింత మెరుగైన  అత్యవసర వైద్య సేవలు అందించడం కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు  అన్నారు . సోమవారం కొవ్వూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూటమి నాయకులు  మున్సిపల్ చైర్ పర్సన్ భావన రత్నకుమారి  తో కలిసి నూతన ఆంబులెన్స్ ను ప్రారంభించిన శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు. కొవ్వూరు నియోజకవర్గంలో వైద్య సేవలను మరింత బలోపేతం చేసే దిశగా కీలకమైన చర్యలో భాగంగా, అత్యాధునిక సాంకేతికతతో కూడిన అడ్వాన్స్‌డ్ లైఫ్ సపోర్ట్ (ఏఎల్ఎస్) అంబులెన్స్‌ను కేటాయించడం జరిగింది. ఈ అంబులెన్స్‌లో అత్యవసర వైద్య సేవలకు అవసరమైన అన్ని ఆధునిక పరికరాలు అందుబాటులో ఉన్నాయి. అంబులెన్స్‌ను  శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వర రావు  స్వయంగా పరిశీలించి, దానిలోని వైద్య పరికరాలు, సాంకేతిక సౌకర్యాల గురించి వివరంగా తెలుసుకున్నారు. అనంతరం, ఆయన జెండా ఊపి అంబులెన్స్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్యం అందించడం కూటమి ప్రభుత్వ లక్ష్యమని . ప్రజలకు అత్యవసర వైద్య సేవలు సకాలంలో  సమర్థవంతంగా అందించడానికి  ఈ అంబులెన్స్ కీలకపాత్ర  వహిస్తుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో  కూటమి  నాయకులు,  హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు