Homeజిల్లాలుశ్రీ సత్యసాయిశానిటేషన్ కార్మికుల బకాయి ఉన్న వేతనాలు వెంటనే ఇవ్వాలి

శానిటేషన్ కార్మికుల బకాయి ఉన్న వేతనాలు వెంటనే ఇవ్వాలి

- Advertisement -

-ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు రాజేష్ గౌడ్ డిమాండ్

విశాలాంధ్ర అనంతపురం : మెడికల్ కళాశాల శానిటేషన్ కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు రాజేష్ గౌడ్ డిమాండ్ చేశారు, ఏఐటియుసి అనుబంధ ఏపి మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ & వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం స్థానిక ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రధాన ద్వారం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా రాజేష్ గౌడ్ మాట్లాడుతూ… మెడికల్ కళాశాలలో పనిచేసే శానిటేషన్ కార్మికులకు మూడు నెలల వేతనాలు బకాయి ఉన్నాయన్నారు. కార్మికులకు వేతనాలు నెలలు కొద్ది పడకపోతే ఏవిధంగా బతకాలన్నారు. గత నాలుగు సంవత్సరాల నుండి శానిటేషన్ కాంట్రాక్టర్ గా ఉన్న ఏ1 స్పెసిలిటీ వారు కార్మికులకు ఇవ్వాల్సిన వేతనాలు కూడా సరిగా ఇవ్వకుండా చాలా ఇబ్బందులకు గురిచేశారన్నారు. కార్మికుల హక్కుగా భావించే ఈపిఎఫ్ సగం కూడా జమ చేయట్లేదన్నారు. ,ఆరోగ్యం బాగోలేక చూపించుకోవడానికి ఈయస్ఐ డిస్పెంసరీ కి వెలితే డబ్బులు కట్టలేదని చూడట్లేదన్నారు, కాంట్రాక్టరు ఇంతచేస్తున్నా అధికారులు పాలకులు అసలు స్పందించడం లేదన్నారు,తక్షణమే సమస్యలు పరిష్కరించకుంటే దశలవారి ఆందోళనలు నిర్వహిస్తామన్నారు,
ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నగర ప్రధాన కార్యదర్శి కృష్ణుడు,ఏపి మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ & వర్కర్స్ యూనియన్ నగర ప్రధాన కార్యదర్శి వెంకటేష్,నాయకులు నారప్ప,ఫామీదా,లక్ష్మిదేవి,పెద్దక్క,గంగాతదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు